ఢిల్లీని ముంచెత్తిన వానలు – రెడ్ అలర్ట్ జారీ
ఢిల్లీలో భారీ వర్షాలు విరజిమ్ముతున్నాయి. శుక్రవారం రాత్రి ప్రారంభమైన కుంభవృష్టి వానలు రాజధానిని జలమయం చేశాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయి, రోడ్లు చిన్న నదులను తలపిస్తున్నాయి.
వాతావరణ శాఖ ఈరోజు కూడా భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల ప్రభావంతో విమాన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 200కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ప్రయాణానికి ముందు తమ తమ ఎయిర్‌లైన్ల తాజా అప్‌డేట్స్ తెలుసుకోవాలని సూచించింది.
కన్నౌట్ ప్యాలెస్, మథుర రోడ్, భారత్ మండపం వంటి కీలక ప్రాంతాల్లో నీరు మునిగిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అంతేకాక, హిమాచల్ ప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తూ జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి.
Post a Comment