మూడు రోజులు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
హైదరాబాద్,: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వర్షాల ఆగ్రహం మొదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన కుండపోత వాన కురిసి నగర జీవనాన్ని అతలాకుతలం చేసింది. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వాతావరణ శాఖ ప్రకారం, దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, కుమురం భీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట జిల్లాల్లో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది.
Post a Comment