-->

ఇంద్రవెల్లి ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా దేవుని జాతరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు

ఇంద్రవెల్లి ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా దేవుని జాతరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు


ఇంద్రవెల్లి, జనవరి: ఇంద్రవెల్లి ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా దేవుని జాతరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఈ నెల 18న మహాపూజతో ఘనంగా ప్రారంభం కానుంది.

జాతరకు లక్షలాది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పనులను ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాస్, ఏఈ భానుకుమార్ పర్యవేక్షిస్తున్నారు.

పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో కేస్లాపూర్‌ నుంచి దస్నాపూర్‌ వరకు బీటీరోడ్డు మరమ్మతులు కొనసాగుతున్నాయి. అలాగే కేస్లాపూర్‌ గ్రామానికి అనుబంధంగా ఉన్న మల్లాపూర్‌ బైపాస్‌ మట్టిరోడ్డు, మెండపల్లి, హర్కపూర్‌ చౌక్‌ నుంచి వెళ్లే మట్టిరోడ్ల పనులను పూర్తి చేశారు.

ఇదే సమయంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో దర్బార్‌ ఏర్పాటు పనులు కూడా ముమ్మరం చేశారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు దుకాణ సముదాయాలు, రంగుల రాట్నాలు, సర్కస్‌ల ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793