-->

తెలంగాణ మున్సిపాలిటీ నామినేషన్లకు నేడు ఆఖరి రోజు

తెలంగాణ మున్సిపాలిటీ నామినేషన్లకు నేడు ఆఖరి రోజు


హైదరాబాద్‌, జనవరి 30:  రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల దాఖలు జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు అయిన గురువారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.

రెండో రోజు మొత్తం 7,403 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటిలో 7,080 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

సాయంత్రం ఐదు గంటలలోపు ఆర్వో కార్యాలయ ప్రాంగణంలోకి చేరిన అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తొలిరోజు 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లు సమర్పించారు.

నామినేషన్ల దాఖలుకు నేడు (శుక్రవారం) చివరి గడువు కావడంతో, చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793