-->

వైద్య విద్యార్హతలు లేకుండా క్లినిక్ నిర్వహణ – ఎస్ఓటి పోలీసుల దాడి నకిలీ డాక్టర్ అరెస్ట్

వైద్య విద్యార్హతలు లేకుండా క్లినిక్ నిర్వహణ – ఎస్ఓటి పోలీసుల దాడి నకిలీ డాక్టర్ అరెస్ట్


ఉప్పల్: వైద్య విద్యార్హతలు లేకుండానే డాక్టర్‌గా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఓ నకిలీ వైద్యుడిని ఉప్పల్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డ ప్రాంతంలో ఉన్న అంజలి ఫార్మసీ అండ్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పై ఎస్ఓటి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో నకిలీ డాక్టర్‌గా వ్యవహరిస్తున్న బానోతు శ్రీను, అలాగే ఫార్మసీ సర్టిఫికెట్ లేకుండానే మెడికల్ షాప్ నిర్వహిస్తున్న మదరపు కరుణాకర్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి బీపీ ఆపరేటర్, స్టెథస్కోప్, క్లినిక్‌కు సంబంధించిన పరికరాలు, మెడికల్ షాప్ సరుకులు, నాలుగు గర్భ నిరోధక మాత్రల కిట్లు, ఇతర ఔషధాలు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఇద్దరిని తదుపరి చర్యల కోసం ఉప్పల్ పోలీసులకు అప్పగించామని, వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్సై వినయ్ తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793