నడిరోడ్డుపై కారు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
జనవరి 16, 2026 | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిపల్లి టోల్ గేట్ సమీపంలో నడిరోడ్డుపై ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే కారును రోడ్డుపక్కకు ఆపి, అందులో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కిందికి దించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో కారు పూర్తిగా కాలిపోయింది.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Post a Comment