-->

అప్పుల బాధ.. భర్త వేధింపులు తాళలేక ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

అప్పుల బాధ.. భర్త వేధింపులు తాళలేక ఉపాధ్యాయురాలు ఆత్మహత్య


కోరుట్ల, జనవరి 13: అప్పుల భారం, భర్త వేధింపులు తాళలేక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోరుట్ల పట్టణంలో విషాదాన్ని నింపింది.

పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వంగ శ్రీధర్ బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య రమ్య సుధ (36) వరంగల్ జిల్లా రాయపర్తి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సంక్రాంతి సెలవుల సందర్భంగా శనివారం రమ్య సుధ కోరుట్లలోని తన నివాసానికి వచ్చింది.

భర్త శ్రీధర్ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇంటి కోసం తీసుకున్న అప్పులు, వ్యక్తిగత రుణాలు పేరుకుపోవడంతో కుటుంబ నిర్వహణ మొత్తం రమ్య సుధ జీతంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు రుణాలు, ఇతరత్రా అప్పులకు రమ్య సుధ ష్యూరిటీగా ఉండటంతో ఆమెపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

అప్పుల చెల్లింపుల విషయంలో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. సోమవారం కూడా ఇదే అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర మనస్థాపానికి గురైన రమ్య సుధ తన ఇద్దరు కుమారులను బయట ఆడుకోవడానికి పంపించి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలి తండ్రి రఘురామ్ ఫిర్యాదు మేరకు, అల్లుడు శ్రీధర్ బలవంతంగా అప్పులు చేయించి తన కూతురు ఆత్మహత్యకు కారణమయ్యాడని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793