తనపై లైంగిక దూషణలు చేస్తున్నారంటూ CCSలో నటి అనసూయ ఫిర్యాదు
హైదరాబాద్: తనపై సోషల్ మీడియా వేదికగా లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్నారని ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని CCS (Central Crime Station) లో ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా వేదికగా నిరంతరం తనను లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు చేస్తున్నారని అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కరాటే కళ్యాణి, శేఖర్ భాష సహా పలువురు టీవీ యాంకర్లు, సోషల్ మీడియా ఖాతాదారులతో కలిపి మొత్తం 43 మందిపై కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ లైంగిక దూషణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment