త్వరలో హైబ్రిడ్ ATMల ప్రవేశం: చిన్న నోట్ల కొరతకు పరిష్కారం
దేశవ్యాప్తంగా త్వరలోనే హైబ్రిడ్ ATMలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కొత్త తరహా ATMల ద్వారా ప్రజలకు రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న నోట్లు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
హైబ్రిడ్ ATMల ప్రత్యేకత ఏమిటంటే… పెద్ద నోట్లను డిపాజిట్ చేస్తే, అవసరానికి అనుగుణంగా చిన్న నోట్లు, నాణేలు కూడా ఇచ్చే విధంగా ఈ యంత్రాలను రూపకల్పన చేస్తున్నారు. దీంతో చిన్న కరెన్సీ కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని కేంద్రం భావిస్తోంది.
చిన్న నోట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కరెన్సీ ముద్రణను మరింత పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ను కేంద్ర ప్రభుత్వం కోరనుంది. ఈ చర్యలతో రోజువారీ లావాదేవీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గనున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Post a Comment