-->

వెబ్ సిరీస్‌లో అవకాశం పేరుతో యువతిని మోసం చేసిన దర్శకుడు

వెబ్ సిరీస్‌లో అవకాశం పేరుతో యువతిని మోసం చేసిన దర్శకుడు


హైదరాబాద్: వెబ్ సిరీస్‌లో అవకాశం ఇస్తానని చెప్పి ఓ యువతిని మోసం చేసి, ఆమెతో అసభ్య వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చి యూసఫ్‌గూడలో తన స్నేహితురాలి వద్ద నివసిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడిగా పరిచయం అయిన శంకర్ అనే వ్యక్తి వెబ్ సిరీస్‌లో అవకాశం ఇస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు.

అనంతరం కారులో అసభ్య డైలాగులు చెప్పిస్తూ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాడు. అయితే అక్కడితో ఆగకుండా ఆ వీడియోలను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలు చూసిన యువతి తల్లిదండ్రులు ఆమెను తీవ్రంగా మందలించారు.

దీంతో వీడియోలు తొలగించాలని యువతి కోరగా, దర్శకుడు శంకర్ మరిన్ని సోషల్ మీడియా వేదికల్లో వీడియోలు పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు శంకర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793