-->

భూ ప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

జగిత్యాల జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు


జగిత్యాల, మార్చి 8: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం సుమారు 12:45 గంటల సమయంలో కేవలం రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.

ఈ సమయంలో పెద్ద శబ్దం కూడా వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థంకాక చాలామంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతసేపు గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. భూ ప్రకంపనలకు కారణాలు ఏమిటన్న విషయంపై అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793