-->

ప్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

ప్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం


హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి కాటేదాన్ సమీపంలో ఉన్న ప్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, స్థానికులు కూడా అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేస్తున్నారు.

అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా అన్న విషయంపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

మంటల తీవ్రత కారణంగా గోదాంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793