-->

స్త్రీ లేకపోతే మానవ మనుగడే లేదు – స్త్రీలను గౌరవించాలి: షేఖ్ అబ్దుల్ బాసిత్

స్త్రీ లేకపోతే మానవ మనుగడే లేదు – స్త్రీలను గౌరవించాలి: షేఖ్ అబ్దుల్ బాసిత్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్త్రీ లేకపోతే మానవ మనుగడే లేదని, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీలను సమాన స్థాయిలో గౌరవించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో ముందస్తుగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక స్త్రీ తల్లిగా జన్మనిచ్చి, తన సుఖసంతోషాలను త్యాగం చేసి కుటుంబ బాగోగులు చూసుకుంటుందని తెలిపారు. చెల్లిగా ప్రేమను పంచి, భార్యగా కుటుంబాన్ని కాపాడుతూ, కూతురిగా ఆనందాలను పంచే స్త్రీలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.

అవకాశం ఇస్తే స్త్రీలు అన్ని రంగాల్లో రాణించగలరని నేటి సమాజంలో వారు నిరూపిస్తున్నారని చెప్పారు. భారతీయ సంస్కృతిలో స్త్రీలకు అత్యున్నత స్థానం కల్పించబడిందని పేర్కొన్నారు.

“తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది”, “మీ భార్య పట్ల మంచితనంతో వ్యవహరించే వారే మీలో ఉత్తములు”, “ఇద్దరు లేదా ముగ్గురు కూతుళ్లను లేదా సోదరీమణులను పెంచి, వారు తమ కాళ్ల మీద నిలబడేలా చేయగలిగిన వారికి స్వర్గం లభిస్తుంది” అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన హదీస్‌లను ఆయన గుర్తు చేశారు.

నేటి ఆధునిక యుగంలో కూడా స్త్రీలు వివక్షకు గురవుతుండటం చాలా దురదృష్టకరమని, విద్యార్థులు చిన్ననాటి నుంచే స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా చిన్నారులు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో మహిళల ఔన్నత్యాన్ని వివరిస్తూ చేసిన ప్రసంగాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, లక్ష్మీ ప్రసన్న, సరస్వతి, నుస్రత్, జేఫీషా, విజయలక్ష్మి, శిరీషా, నీల, సల్మా, నాజీయ సుల్తానా, సుహానా, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793