ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు
తెలంగాణ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మెదక్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొల్చారం జాతీయ రహదారిపై ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించే సమయంలో అదుపుతప్పి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన అంశాలపై విచారణ కొనసాగుతోంది.

Post a Comment