ఓసిపి-1లో సీనియర్ ఆపరేటర్‌కు ఘన వీడ్కోలు
ఓసిపి-1 (OCP-1) ప్రాజెక్టులో పనిచేస్తున్న పృథ్వీభంజన్ డ్రాగ్‌లైన్ సీనియర్ ఆపరేటర్ అస్నార్ గారి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, జి.వి.ఎస్.ఇ. సంఘాల కృషి వల్ల రిటైర్ అయ్యే కార్మికులకు పెన్షన్, మెడికల్ కార్డులు వంటి అనేక సౌకర్యాలు లభిస్తున్నాయని తెలిపారు. ఇవి కార్మికులకు ఒక వరం లాంటివని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో భాగంగా పదవీ విరమణ పొందుతున్న అన్నార్ గారిని ఘనంగా సత్కరించి, మెమెంటోలు అందజేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి ముహమ్మద్ ఇస్మాయిల్, వైస్ ప్రెసిడెంట్ శాంతి స్వరూప్, నాయకులు పెసరస్వామి, సాంఫి రవి, బండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే యాక్టింగ్ చీఫ్ మేనేజర్ భరీ, అధికారులు నూర్, మోహన్, మధు, నాయకులు డి.టి.రావు, గడ్డం తిరుపతి, సాయిస్ గ్రూప్ సభ్యులు మరియు ఇతరులు కూడా హాజరయ్యారు.

Post a Comment