-->

తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడే విడుదల

మధ్యాహ్నం 2 గంటలకు రిజల్ట్స్ ప్రకటింపు – వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం


హైదరాబాద్: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాలు నేడు (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్‌సీఈఆర్టీ ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు అధికారికంగా ఫలితాలను ప్రకటించనున్నారు.

ఈసారి విద్యార్థులకు సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ వెబ్‌సైట్లతో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపితే ఫలితాలు అందుబాటులోకి వస్తాయని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించబడ్డాయి. గతంలో అన్ని పరీక్షలను వరుసగా నిర్వహించగా, ఈసారి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి పరీక్షకు మధ్య 3 నుంచి 4 రోజుల విరామం ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదలతో విద్యార్థుల భవిష్యత్ విద్యా ప్రణాళికలకు దారి సుగమం కానుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793