-->

అనుమానం పెద్ద పెను భూతం… భార్యను హత్య చేసిన భర్త

అనుమానం పెద్ద పెను భూతం… భార్యను హత్య చేసిన భర్త


హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం పెరిగి ప్రాణాంతకంగా మారిన సంఘటన మీర్‌పేట్ పరిధిలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన నరసింహ (60) తన భార్య వసంతతో కలిసి హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో నివసిస్తున్నాడు.

ఇటీవల కాలంలో భార్యపై వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న నరసింహ, అదే అనుమానం కారణంగా తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లోనే వసంతపై కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్రంగా గాయపరిచడంతో ఆమెకు అధిక రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నరసింహపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన మరోసారి కుటుంబాల్లో అనుమానం, ఆవేశం ఎంతటి విషాదాలకు దారితీస్తాయో గుర్తు చేస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793