టీఆర్ఎస్ పేరుకు సీఈసీ ఆమోదం.. కల్వకుంట్ల కవితకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్తగా ఏర్పాటు చేయబడుతున్న టీఆర్ఎస్ పార్టీ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్టీ స్థాపకురాలు కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి లేఖ అందజేశారు.
ఈనెల 25న మేడ్చల్ జిల్లాలోని అద్వయ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)’ పేరును ప్రకటించారు. తాజాగా ఆ పేరుకు సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా పార్టీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక అనుమతి పత్రాన్ని అందజేసినట్లు సమాచారం. దీంతో పార్టీ కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ ఏర్పాటుతో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Post a Comment