సిరిసిల్ల బైపాస్ రోడ్డు ప్రమాదంలో విషాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి
సిరిసిల్ల బైపాస్ రోడ్డు ప్రమాదంలో విషాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాంతంగా మారింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అభిషేక్ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం, బుధవారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న కారు సిరిసిల్ల బైపాస్ రోడ్డుపై ముందుగా వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అభిషేక్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశాడు.
యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Post a Comment