-->

ఇల్లంతకుంట ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. పత్తిగింజల బస్తాలు దగ్ధం

 

ఇల్లంతకుంట ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. పత్తిగింజల బస్తాలు దగ్ధం
ఇల్లంతకుంట ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. పత్తిగింజల బస్తాలు దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదంలో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన పత్తిగింజల బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి.

అర్ధరాత్రి సమయంలో మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సకాలంలో స్పందించడంతో మంటలు మరింత వ్యాపించకుండా నిలువరించగలిగారు.

ఈ ప్రమాదంలో కొద్దిపాటి ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే మిల్లులో నిల్వ చేసిన పత్తిగింజల బస్తాలకు ఇరువైపులా ఉన్న వడ్ల బస్తాలకు పెద్దగా నష్టం జరగకపోవడం, మధ్యలో ఉన్న పత్తిగింజల బస్తాలకే మంటలు వ్యాపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ ఘటనపై పలు కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.

అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఏదైనా ఇతర కారణం ఉందా? అనే దిశగా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఫోరెన్సిక్ నివేదికలు, అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793