తెలంగాణ ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలందరికీ, కుటుంబ సభ్యులందరికీ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, TBGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ దంపతులు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, సంతోషాలను పంచుకుంటూ జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఐక్యత, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.
అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

Post a Comment