గ్రామసభలో దళిత మహిళపై దాడి.. కాంగ్రెస్ నేతపై కేసు
గ్రామసభలో దళిత మహిళపై దాడి.. కాంగ్రెస్ నేతపై కేసు
నల్గొండ: గ్రామసభలో పొదుపు సంఘాల డబ్బుల వ్యవహారంపై జరిగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పీ.కే. మల్లేపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన గ్రామసభలో దళిత మహిళ, వీఓఏ మాధవిపై స్థానిక కాంగ్రెస్ నేత అమర్నాథ్ గౌడ్ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
పొదుపు సంఘాల డబ్బుల విషయంలో మాధవితో అమర్నాథ్ గౌడ్ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమెపై దాడి చేసి, చెంపపై కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టినట్లు బాధితురాలు ఆరోపించారు.
ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. గ్రామసభలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అమర్నాథ్ గౌడ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment