-->

ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజే చిన్నారి, తండ్రి మృతి

 

ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజే చిన్నారి, తండ్రి మృతి

ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజే చిన్నారి, తండ్రి మృతి

హైదరాబాద్‌: నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ లారీ రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో పుట్టినరోజు వేడుక జరుపుకునేందుకు కుటుంబంతో వచ్చిన ఆరేళ్ల చిన్నారి ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. అల్వాల్‌కు చెందిన సరాక్షి (6) పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులు వేడుకలు జరుపుకునేందుకు నగరానికి వచ్చారు. కూకట్‌పల్లిలోని పీవీఆర్‌లో సినిమా చూసిన అనంతరం కేక్‌ కటింగ్‌ చేసేందుకు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు.

మగ్ధం మోయుద్దీన్‌ విగ్రహం వద్ద కారును పార్క్‌ చేసి కుటుంబ సభ్యులు హుసేన్‌సాగర్‌ వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. సికింద్రాబాద్‌ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో చిన్నారి సరాక్షి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె బంధువు విశ్వంత్‌ (41) తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందారు.

పుట్టినరోజును ఆనందంగా జరుపుకోవాలని కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వచ్చిన చిన్నారి.. అదే రోజున ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వేడుకల కోసం వచ్చిన కుటుంబానికి ఈ ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది.

Blogger ఆధారితం.