మహిళా ఆర్టిజన్లకు రూ.2.27 లక్షల చెక్కు పంపిణీ.. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి యోగ్యత పత్రాలు అందజేత
నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళా ఆర్టిజన్లకు రూ.2.27 లక్షల చెక్కు పంపిణీ.. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి యోగ్యత పత్రాలు అందజేత
పాల్వంచ, నవంబర్ 28: నవ లిమిటెడ్, పాల్వంచ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల బహూకరణ, చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తాటి ఆకులతో వివిధ కళాకృతులు, జ్యూట్ బ్యాగుల తయారీతో పాటు వాటి విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం రూ.2,27,610ల చెక్కును జీయర్ స్వామివారి చేతుల మీదుగా మహిళా ఆర్టిజన్లకు అందజేశారు. అలాగే కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆఫీస్ ఆటోమేషన్ విభాగంలో యోగ్యత పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా జీయర్ స్వామివారు మాట్లాడుతూ మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, వాటిని ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి, స్వావలంబన సాధించే దిశగా నవ యాజమాన్యం చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు, వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో నవ లిమిటెడ్ ప్రమోటర్ రమా దేవినేని, సీఎస్ఆర్ హెడ్ డి. సుధాకర్, శ్రీనివాసరావు, అముద, టి. అరుణ, బి. అరుణ, శిరీష, దివ్య, కవిత, రమేష్, రాజకుమారి తదితరులు, శిక్షణ పొందిన విద్యార్థులు, మహిళా ఆర్టిజన్లు పాల్గొన్నారు.

Post a Comment