రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలి.. టీజీవో కేంద్ర సంఘం డిమాండ్

 

ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలి

ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలి

 రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలి.. టీజీవో కేంద్ర సంఘం డిమాండ్

**హైదరాబాద్:** తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని టీజీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే స్వీకరించి, రాష్ట్రంలో రెండో పీఆర్సీని ప్రకటించాలని కోరారు.

శనివారం నాంపల్లిలో నిర్వహించిన టీజీవో కేంద్ర సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు హైదరాబాద్ సిటీ పరిధిలోని వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు.

ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలని సమావేశం కోరింది. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రతి నెలా రూ.2 వేల కోట్ల చొప్పున విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి సమావేశంలో ఆమోదించిన తీర్మానాల ప్రతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు అందజేయనున్నట్లు టీజీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు కోరారు.


Blogger ఆధారితం.