బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి కేసులో కీలక ట్విస్ట్.. బెట్టింగ్ యాప్ కాదు.. సైబర్ మోసం!

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి కేసులో కీలక ట్విస్ట్.. బెట్టింగ్ యాప్ కాదు.. సైబర్ మోసం!

 బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి కేసులో కీలక ట్విస్ట్.. బెట్టింగ్ యాప్ కాదు.. సైబర్ మోసం!

### బాసర IIIT విద్యార్థి మృతిపై పూర్తి వార్త

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంపత్ కుమార్ మృతి ఘటనపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. విద్యార్థి మృతికి బెట్టింగ్ యాప్‌తో ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురికావడం వల్లే విద్యార్థి ఈ విషాద నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.

విలేకరులతో మాట్లాడిన ఎస్పీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం.. సంపత్ కుమార్ గత మూడు నెలలుగా ఓ ఇన్వెస్టింగ్ యాప్‌లో పెట్టుబడులు పెడుతూ లాభాలు పొందుతున్నాడు. తన తల్లికి బంగారు నగలు కొనివ్వాలనే ఉద్దేశంతో ఈ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు.

అయితే ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న సంపత్ మరో ప్రైవేట్ యాప్‌లో డబ్బులు పెట్టుబడిగా పెట్టాడు. కొంతకాలం తర్వాత ఆ యాప్ అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీంతో సంపత్ పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయాననే ఆవేదనకు గురయ్యాడు.

డబ్బులు పోగొట్టుకున్నాననే మనస్తాపంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనతో విద్యార్థి కుటుంబంలో విషాదం నెలకొంది. సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఆకర్షితులై ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టే ముందు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.



Blogger ఆధారితం.