ఎస్‌ఐలుగా పదోన్నతి.. వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు
ఎస్‌ఐలుగా పదోన్నతి.. వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు
వరంగల్: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఏఎస్ఐలు) విధులు నిర్వహిస్తూ, సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఎస్‌ఐలు) పదోన్నతి పొందిన అధికారులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
పదోన్నతి పొందిన వారిలో టి. కమల, ఎం. రాజేందర్, ఏ. సగాయమ్మ, వై. కాసులు, కె. పద్మ, ఎన్. లక్ష్మి, కె. సంతోష, సీహెచ్. పద్మ ఉన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత నూతనంగా ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన అధికారులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సీపీ వారికి సూచించారు.

Post a Comment