కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

 

కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

**హైదరాబాద్:** కుత్బుల్లాపూర్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట బొడ్రాయి సమీపంలో పార్కింగ్ చేసి ఉంచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఐదు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.

ఆదివారం తెల్లవారుజామున సుమారు ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తొలుత ఒక బస్సులో మంటలు ప్రారంభమయ్యాయి. పక్కపక్కనే ఇతర బస్సులు పార్కింగ్ చేసి ఉండటంతో మంటలు క్షణాల్లోనే మిగతా వాహనాలకు వ్యాపించాయి. దీంతో ఐదు బస్సులు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిలో మూడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయని సమాచారం.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు.

ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందా? ఆస్తి నష్టం ఎంత మేరకు సంభవించింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

**ఒక్కసారిగా ఐదు బస్సులు అగ్నికి ఆహుతి కావడంతో స్థానికంగా కలకలం రేగింది.**


Blogger ఆధారితం.