జమాతె ఇస్లామీ హింద్ నాయకులకు ఘన సన్మానం

 

మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో విశేష సేవలకు గుర్తింపు

జమాతె ఇస్లామీ హింద్ నాయకులకు ఘన సన్మానం

మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో విశేష సేవలకు గుర్తింపు

గోదావరిఖని: యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటంతో పాటు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ప్రచారంలో విశేష సేవలు అందించిన జమాతె ఇస్లామీ హింద్ నాయకులను తెలుగు వార్తా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

జమాతె ఇస్లామీ హింద్ గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన గోదావరిఖని శాఖ అధ్యక్షులు సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేనీ, ఉపాధ్యక్షులు ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, కార్యక్రమాల మోడరేటర్ ఐషా సిద్ధిఖాలను సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు వార్తా ప్రతినిధులు మేదరి నర్సింగరావు (పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి), జంజర్ల రమేష్ (మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి), రాజశ్రీ (మంథని టౌన్ రిపోర్టర్), రవికుమార్ (రామగిరి రిపోర్టర్) పాల్గొని నాయకులకు ఘనంగా సన్మానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి, యువతను చెడు వ్యసనాల నుంచి కాపాడేందుకు జమాతె ఇస్లామీ హింద్ చేపట్టిన ప్రచార కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు.

సమాజంలో చైతన్యం తీసుకురావడం, యువతలో మంచి ఆలోచనా విధానాన్ని పెంపొందించడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయడం వంటి లక్ష్యాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు.

భవిష్యత్తులోనూ యువత సంక్షేమం, సామాజిక అభివృద్ధి, ప్రజా చైతన్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

Blogger ఆధారితం.