మరో రెండు రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో కాబోయే పెళ్లికొడుకు మృతి!

 

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు

మరో రెండు రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో కాబోయే పెళ్లికొడుకు మృతి!

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు

వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుంకిమెట్ల–కోస్గి మార్గంలో కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో లగచర్ల గ్రామానికి చెందిన శ్రీశైలం ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఆయనకు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కొడంగల్ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.