ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 9 ఏళ్ల బాలుడు మృతి!

 

ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 9 ఏళ్ల బాలుడు మృతి!

ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 9 ఏళ్ల బాలుడు మృతి!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆసిఫాబాద్ మండలం మొతుగూడ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మొతుగూడ గ్రామంలోని జాతీయ రహదారిపై ఉన్న సర్వీస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్‌కు వస్తున్న ఆసిఫాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (TS20 T 8538) ఇంటి ముందు ఆడుకుంటున్న చౌదరి వర్షిత్ (9) అనే బాలుడిని ఢీకొట్టినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదో తరగతి విద్యార్థి వర్షిత్ మృతి చెందాడు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అప్పటివరకు ఇంటి ముందు తోటి వారితో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మృతితో మొతుగూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Blogger ఆధారితం.