150 కిలోల గంజాయి స్వాధీనం..ఇద్దరి అరెస్టు
150 కిలోల గంజాయి స్వాధీనం..ఇద్దరి అరెస్టు
కారులో డిక్కీలో 79 ప్యాకెట్లలో 158 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటన మండలంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
టేకులపల్లి ఎస్సై సైదా రవూప్ తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బేతంపూడి గ్రామ పంచాయతీ పరిధి వెంకట్యాతండా గ్రామ సమీపాన కొత్తగూడెం-ఇల్లందు వెళ్లు ప్రధాన రహదారిపై ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సాయంత్రం 3.30గంటల సమయంలో ఒక మారుతి బ్రీజా టీజీ 030141 కారులో కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు పెనుగొండ వెంటరాజు, బోదాసు తిరుపతిలు వేగంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా వెనుక డిక్కీలో 79 ప్యాకెట్లులో 158 కేజీల గంజాయిని పట్టుకున్నారు. వారి ఇద్దరిని, కారుని, గంజాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవూప్ తెలిపారు.
ఈ గంజాయి విలువ సుమారుగా రూ. 39 లక్షల 50 వేలు ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సీఐ తాటి పాముల సురేష్, ఎస్ ఐ సైదా రవూప్ , సిబ్బంది భాను, సురేష్, పంచాయతీ కార్యదర్శులు కిరణ్, పాషా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment