-->

హైదరాబాద్ మరో దారుణ హత్య..

హైదరాబాద్ మరో దారుణ హత్య..

 హైదరాబాద్ మరో దారుణ హత్య..

హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీపట్నంలో మరో వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. సెంటెన్స్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. 

దీంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి కు తరలించారు పోలీసులు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా పాతబస్తీలో వరుస హత్యలు…భయాందోళన రేపుతున్నాయి. 

రెండు రోజుల వ్యవధిలో 6 హత్యలు, 2 హత్యా యత్నాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ మెహదీపట్నంలో మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఓల్డ్ సిటీలోని నవాబ్ సాబ్ కుంట అచ్చి రెడ్డి నగర్ లో దారుణం జరిగింది. 

ఇంట్లోకి చొరబడి మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ కు హత్య చేశారు దుండగులు. అక్రమ సంబంధం కారణం గానే జాకీర్ ను హత్య చేసినట్లుపోలీసులు గుర్తించారు. షాహిన్ అనే మహిళతో పాటు భర్త హసన్ మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793