-->

నరసింహసాగర్‌కు వెళ్లే బస్సు సర్వీసును ప్రారంభించిన మంత్రి సీతక్క

నరసింహసాగర్‌కు వెళ్లే బస్సు సర్వీసును ప్రారంభించిన మంత్రి సీతక్క


ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఏటూరు నాగారం నుంచి మంగపేట మండలం నరసింహసాగర్‌కు వెళ్లే బస్సు సర్వీసును మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు.

ఈ మేరకు ఆమె కలెక్టర్‌తో కలిసి ఆ బస్సులో టికెట్ తీసుకుని ఉచితంగా ప్రయాణించారు. ఆమె పర్యటన సందర్భంగా ఏటూరు నాగారంలో బస్ డిపో ఏర్పాటు, ములుగు బస్ స్టాండ్‌ను మోడల్ బస్ స్టాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఆ రెండు పనులకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టనున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793