జీడిమెట్ల అగ్నిప్రమాదం ఇంకా ఆరని మంటలు
జీడిమెట్ల పారిశ్రామికవాడలో జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదం తీవ్రనష్టాన్ని కలిగించింది. SSV ఫ్యాబ్ పరిశ్రమలో ఉన్న ప్లాస్టిక్ ముడి సరుకు కారణంగా మంటలు వేగంగా వ్యాపించి భవనం మొత్తం ధ్వంసమైంది. మూడు అంతస్తులు పూర్తిగా కాలి, నాల్గవ అంతస్తు కూడా కూలిపోయింది.
ఫైర్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ మంటలు భారీగా ఉండటంతో అదుపులోకి తీసుకోవడం చాలా కష్టంగా మారింది. నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి 1 గంట ప్రాంతానికి 75% ధగ్ధమైన భవనం, ఇంకా మంటలు కొనసాగుతున్నాయి.
ప్లాస్టిక్ ముడి సరుకు పెద్ద మొత్తంలో ఉండడం వల్ల మంటలు అదుపులోకి రావడానికి సమయం తీసుకుంటోంది. మధ్యాహ్నం వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంపై ఆశలున్నాయి. ఈ సంఘటన వల్ల ఆర్థిక నష్టం భారీగా ఉందని తెలుస్తోంది.

Post a Comment