రాజ్యాంగ దినోత్సవం ఒక జాతీయ పండుగ
కొత్తగూడెం లీగల్:: రాజ్యాంగం 75 సంవత్సరాల క్రితం నవంబర్ 26న ఆమోదింపబడిందని రాజ్యాంగ దినోత్సవం మనకు కేవలం ఒక పండుగ కాదని దేశంలోని ప్రతి పౌరుడు, హక్కులు, విధుల పట్ల అవగాహన కలిగి ఉండే రోజు అని జిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు.
నేషనల్ లాడే,/రాజ్యాంగ దినోత్సవం/ సంవిధాన్ దివాస్ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ముఖ్యఅతిథిగా మంగళవారం పాల్గొని రాజ్యాంగ పీఠీకను అందరిచే ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ప్రసంగిస్తూ రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు, సామాజిక న్యాయానికి, సమాజం సమానత్వానికి, స్వేచ్ఛకు బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా బారాసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే విస్తృతమైన రాజ్యాంగం దానిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ రచన కమిటీ తయారు చేసిందని మన దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థను అందించడంలో కీలకపాత్ర పోషించిందని అన్నారు..ఈ కార్యక్రమంలో జూనియర్ న్యాయవాదుల కు రాజ్యాంగంపై వకృత పోటీలు నిర్వహించి బహుమతి ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ గొల్లపూడి భానుమతి, కే సాయిశ్రీ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు సాదిక్ పాషా, ఎస్ ప్రవీణ్ కుమార్, ధూళిపాళ్ల రవికుమార్, పిపీలు పివిడి లక్ష్మి, విశ్వశాంతి, లావణ్య, వెలగల నాగిరెడ్డి, సీనియర్ జూనియర్ పాల్గొన్నారు.

Post a Comment