-->

సింగరేణి సి&ఎండి ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేర్చాలి

 

సింగరేణి సి&ఎండి ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేర్చాలి

కార్మికులు, అధికారులు, సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ   శుభాకాంక్షలు తెలిపిన HMS రియాజ్ అహ్మద్

సింగరేణి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల చిరకాల కోరికలు అయిన ఇన్కమ్ టాక్స్ మాఫీ మరియు సొంతింటి కల సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షులు, వేజి బోర్డు మెంబర్ రియాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

135వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం చొరవ తీసుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా ఏఐటియుసి, ఐఎన్‌టియుసి సంఘాలు మొదటి నుంచీ కార్మికులను మోసం చేస్తూ అనేక వాగ్దానాలు చేసి ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చాక తీరని ద్రోహం చేశాయని ఆరోపించారు.

కోల్ ఇండియాలో జేబీసీసీఐ ఒప్పందం మేరకు అలవెన్స్‌లపై ఇన్కమ్ టాక్స్‌ను అక్కడి యాజమాన్యమే భరించినట్లు, సింగరేణిలో కూడా అదే విధంగా యాజమాన్యం భరించాలని రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి అనిల్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి దుర్గం లక్ష్మణ్ పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

Blogger ఆధారితం.