-->

ఫుట్ పాత్ అనాధలకు ఎస్. రీటా స్వచ్చంద సంస్థ దుప్పట్ల పంపిణీ

 

ఫుట్ పాత్ అనాధలకు ఎస్. రీటా స్వచ్చంద సంస్థ దుప్పట్ల పంపిణీ

మెదక్ జిల్లా, తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో ఫుట్ పాస్ పై అనాధలుగా ఉన్న వృద్ధులు మరియు మతి స్థిమితం లేని వారికి ఎస్. రీటా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్. రీటా సంస్థ రామాయంపేట, నర్సింగి, ఇతర ప్రాంతాల్లో రోడ్లపై అనాధలుగా ఉన్న వారిని గుర్తించి, చలికి తట్టుకునే దుప్పట్లు, రగ్గులను అందించారు. సాయం కోసం ముందుకు వచ్చి వారికి బాసటగా నిలిచారు.

గతంలో కూడా కరోనా మహమ్మారి సమయంలో ఎస్. రీటా సంస్థ ఆహారం లేక ఇబ్బందిపడినవారికి అన్నదాన పంపిణీ చేయడంతో పాటు పాఠశాల విద్యార్థులకు గిఫ్టులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు పొందాయి.

ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.


Blogger ఆధారితం.