-->

రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముక సింగరేణి డిప్యూటీ సీఎం భట్టి

 

రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముక సింగరేణి డిప్యూటీ సీఎం భట్టి

కార్మికులు, అధికారులు, సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సింగరేణి కాలరీస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి కార్మికులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బొగ్గు ఉత్ప‌త్తి ద్వారా రాష్ట్రం మరియు దేశం ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి వెన్నుముకగా నిలుస్తున్నదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో లక్షలాది ప్రజలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సింగరేణి, కేవలం బొగ్గు ఉత్పత్తి మాత్రమే కాకుండా ఇతర రంగాల్లోనూ విస్తరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికుల శ్రమశక్తితో ఈ సంస్థను మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు అందరూ కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు.


Blogger ఆధారితం.