పి.వి. రావు, వెంకటస్వామి కాక వర్ధంతి ఘనంగా నిర్వహణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని అంబేద్కర్ నగర్‌లో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పి.వి. రావు వర్ధంతి, ప్రముఖ దళిత నేత, మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాక) వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం మాజీ జడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, "వెంకటస్వామి అణగారిన వర్గాలకు గొప్ప ఆశాజ్యోతి. కార్మికులకు పెన్షన్లను అందించి, జాతీయ స్థాయిలో తెలంగాణ ముద్దు బిడ్డగా ప్రతిష్టను సంపాదించారు" అని కొనియాడారు.
ఇక పి.వి. రావు గురించి మాట్లాడుతూ, "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమాచార శాఖ డైరెక్టర్‌గా ఉన్న పి.వి. రావు ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి, దళితుల ఐక్యత కోసం తన జీవితాన్ని అర్పించారు" అని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సి, ఎస్టీ, బిసి సంఘాల ప్రముఖ నాయకులు సీకురుమల్లి శ్రీనివాస్, బొంతు బాబురావు, సి.హెచ్. సతీష్, బి. బుచ్చ, పల్లి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. పి.వి. రావు, వెంకటస్వామి కాక చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మహిళా మండలి ప్రముఖులు పి. సౌభాగ్యవతి, బి. ప్రియాంక, జి. మా్నిక, కె. పద్మ, పి. ప్రణవి తదితరులు పాల్గొని దళిత నేతల సేవలను గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమం సమాజ ఐక్యతకు, దళితుల హక్కుల కోసం మరింత ప్రేరణనిచ్చిందని అందరూ భావించారు.
Post a Comment