-->

2023-24 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి డివిడెండ్ చెల్లింపు

 

2023-24 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి డివిడెండ్ చెల్లింపు

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి కాలరీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 88.55 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈ డివిడెండ్ చెక్కును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కి, సింగరేణి సీఎండీ ఎన్. బాలరామ్ అందజేశారు.

సింగరేణి చెల్లింపు మూలధనంలో (పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్) 10 శాతం డివిడెండ్‌గా చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ. 173 కోట్లలో, 51% వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 88.55 కోట్ల డివిడెండ్‌ను చెల్లించారు.

సింగరేణి సంస్థ దక్షిణ భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలో పాటు లాభాల సంపాదనలో ముందుంది. కార్మికులకు లాభాల వాటా చెల్లించడంతో పాటు, ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌లు చెల్లించడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793