-->

జమియాత్ ఉల్మా ఆధ్వర్యంలో ఇండోకేర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

జమియాత్ ఉల్మా ఆధ్వర్యంలో ఇండోకేర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జమియాత్ ఉల్మా ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును కొత్తగూడెం ఉర్దూ ఘర్లో నిర్వహించారు. వైద్య శిబిరంలో ఖమ్మం ఇండోకేర్ హాస్పిటల్ ప్రముఖ చెస్ట్ ఫిజిషియన్, MBBS-MD, డాక్టర్ ఫయాజ్ షేక్ మరియు వారి బృందం పాల్గొన్నారు. 

ఇండోకేర్ హాస్పిటల్ వైద్య బృందం ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించడమే కాకుండా, షుగర్ టెస్ట్, గుండె పరీక్ష, బి.పి, ఈసిజీ, ఊపిరితిత్తుల సామర్ధ్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా షేక్ కరీం, మూఫ్తీ యాసిర్ నదీమ్, మూఫ్తీ రఫిక్, హఫీజ్ అహ్మద్, అక్బర్, జియా తదితరులు పాల్గొన్నారు.

ఈ శిబిరం స్థానిక ప్రజల వైద్య అవసరాలను తీర్చడంలో ఎంతో సహాయపడింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793