-->

హ్యాపీ టూ హెల్ప్ యు ఫౌండేషన్ గిరిజనులకు దుప్పట్లు, దుస్తుల పంపిణీ

 

హ్యాపీ టూ హెల్ప్ యు ఫౌండేషన్ గిరిజనులకు దుప్పట్లు, దుస్తుల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని క్రాంతి నగర్ గ్రామంలో హ్యాపీ టూ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజనులకు దుప్పట్లు, దుస్తులు మరియు స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది.

గత కొన్ని రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఫౌండేషన్, వారికి మద్దతుగా దుప్పట్లు వితరణ చేసింది. ఈ కార్యక్రమంలో జాషువా గిరిజన కుటుంబాలకు స్వయంగా దుప్పట్లు అందించారు.

గిరిజనుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, భవిష్యత్తులో మరిన్ని సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫౌండేషన్ సభ్యులు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వినయ్, మనీష్, నవీన్, లెంటిల్, మౌనిష్, గంగా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793