-->

పెద్దమ్మతల్లి గుడి మరుగుదొడ్ల కోసం 25లక్షలతో 2023లో శంకుస్థాపన కట్టుబడి నోచుకోని మరుగుదొడ్లు

పెద్దమ్మతల్లి గుడి మరుగుదొడ్ల కోసం 25లక్షలతో 2023లో శంకుస్థాపన కట్టుబడి నోచుకోని మరుగుదొడ్లు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ 15వ వార్డు సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ వద్ద గల పెద్దమ్మతల్లి గుడి ఆవరణలో ప్రజా మరుగుదొడ్లు నిర్మించుట కొరకు పట్టణ ప్రగతి నిధులుతో 25 లక్షల శిలాఫలకం సెప్టెంబర్ 9వ తేది 2023న అట్టహాసంగా అప్పటి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

అధికారుల అలసత్వం కారణంగా పనులు నిలకడగా ఉండిపోయాయి. పెద్దమ్మతల్లి గుడి వద్ద భక్తులకు మరుగుదొడ్ల అవసరం ఉందన్న దృష్టితో, ప్రభుత్వం రూ. 25 లక్షల నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే, ఈ పనులు మాత్రం ప్రారంభించలేదు, ప్రజాపాలకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిలకడగా నిలిచిపోయింది.

భక్తులు గుడి వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చి భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు మరుగుదొడ్లు లేక ఇబ్బంది  పడుతున్నారు. శిలాఫలకం కట్టుబడి కట్టారు గాని మరుగుదొడ్లు ఇప్పటికీ కట్టుబడి కాకపోవడం స్థానికుల, భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సమస్యను ప్రజపాలకులు, అధికారులు, స్థానిక నాయకులు స్పందించి నిలిచిపోయిన మరుగుదొడ్లు త్వరగా పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రభుత్వం అందించిన నిధులు సద్వినియోగం కాకపోవడం గురించి స్పష్టత రానందున, ఇది మరింత వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది.

ఈ సమస్యను ప్రజాపాలకులు, అధికారుల దృష్టి సారించి వెంటనే మరుగుదొడ్లు పనులు ప్రారంభించి భక్తులు కష్టాలను నివారించే చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు ఆశిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793