సంక్రాంతి పంటల పండుగ - రైతన్నల పండుగ
మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అభిప్రాయం
సంక్రాంతి పంటల పండుగ అని, ఇది కులమతాలకు అతీతంగా రైతన్నలకూ సంఘీభావం తెలిపే విధంగా అందరూ జరుపుకోవాల్సిన పండుగ అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ తెలిపారు.
ఈ రోజు కొత్తగూడెం మునిసిపాలిటీలోని 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం ప్రాంతంలో ఉన్న మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు ముందస్తుగా ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇంటికి తెచ్చుకొని, కొత్త ఆశలు, ఆశయాలతో నూతన జీవితానికి నాంది పలుకుతూ రైతన్నలు జరుపుకునే పండుగ సంక్రాంతి. ఇది కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకోవాల్సిన పండుగ. మనందరికీ అన్నం పెట్టే రైతన్నను గౌరవించటం, ప్రతి విషయంలోనూ వారికి పెద్ద పీట వేయటం మన బాధ్యత" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు రైతుల కృషిని గౌరవిస్తూ ప్రసంగాలు, ప్రదర్శనలు నిర్వహించి అందరినీ అలరించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు:
ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు సరస్వతి, శిరీషా, లక్ష్మీ ప్రసన్న, సల్మా, అనితా, నుసరత్, ఖాజా, విజయలక్ష్మి, నీలా, లతీఫా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment