పతంగులు ఎగరేస్తున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు
పతంగులు ఎగురవేయడం సరదాగా కనిపించినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి ఈ సూచనలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి:
భవనాలపై పతంగులు ఎగురవేయడం: పై నుంచి కింద పడే ప్రమాదం ఉంది. భద్రతను పాటిస్తూ పతంగులు ఎగురవేయండి. మాంజా దారాల వినియోగం: ఇవి మెడకు చుట్టుకుపోయే అవకాశం ఉంది, ఆ పరిస్థితి ప్రాణాపాయంగా మారొచ్చు.
విద్యుత్ స్థంభాలు, తీగలు వద్ద: ట్రాన్స్‌ఫార్మర్లు లేదా విద్యుత్ వైర్ల దగ్గర పతంగులు ఎగురవేయడం ప్రమాదకరం. విద్యుత్ తీగలపై పతంగులు పడితే: వాటిని తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. ప్రమాదం జరగొచ్చు. పక్షులకు ప్రమాదం: తెగిపోయిన పతంగుల దారాలు పక్షుల మెడలకు బిగుసుకుని వాటి ప్రాణాలు తీసే అవకాశం ఉంది.
కాబట్టి పతంగులను ఖాళీ ప్రదేశాల్లో, భద్రతా నియమాలను పాటిస్తూ ఎగురవేయండి!

Post a Comment