ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ కార్పోరేటర్ల సమావేశం
ఖమ్మం నగర బిఆర్ఎస్ కార్పోరేటర్లతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్‌గా కర్నాటి కృష్ణను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా షేక్ మక్బూల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌లను అభినందించిన పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులుగా ప్రజల సమస్యల కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు.
మాజీ మంత్రిని కీలక వ్యాఖ్యలు:
పువ్వాడ అజయ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతిపక్ష పాత్రను సత్వరంగా పోషించి నగరాభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పార్టీ పటిష్టతకు పాటు పడాలని, ఎవరైనా బెదిరింపులకు లొంగవద్దని, ప్రజల సమస్యల పరిష్కారంలో నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
తదుపరి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేస్తూ అధికారాన్ని ఆస్వాదిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ వ్యాఖ్యలు:
కర్నాటి కృష్ణ మాట్లాడుతూ, ఖమ్మం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించక చాలా కాలం అయిందని, నగర సమస్యలను పట్టించుకునే నాథుడే లేకపోవడం బాధాకరమని తెలిపారు. శానిటేషన్, వీధిలైట్లు, నగర శుభ్రత వంటి అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రివ్యూ మీటింగ్‌లు నిర్వహించినా, వాటిని అమలుపరచడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
సమావేశంలో పాల్గొన్న వారిలో
ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Post a Comment