-->

ఎమ్మెల్యే కూనంనేని తో సమావేశమైన TRVKS యూనియన్ నాయకులు

 

ఎమ్మెల్యే కూనంనేని తో సమావేశమైన TRVKS యూనియన్ నాయకులు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం H-58 (TRVKS) రికగ్నైజ్డ్:

హైదరాబాద్‌లోని CPI రాష్ట్ర కార్యాలయంలో TRVKS రాష్ట్ర అధ్యక్షులు కోడూరి ప్రకాశ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం. ఈ సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు మరియు CPI పార్టీ ఫ్లోర్ లీడర్ కూనంనేని సాంబశివరావు ని కలిసి విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించారు.

విద్యుత్ శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, MLA కి వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన కూనంనేని సాంబశివరావు, సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు విద్యుత్ శాఖా మంత్రి మల్లు భట్టీ విక్రమార్క తో తన సమావేశంలో వీటి గురించి ప్రస్తావించానని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం తాను తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో SPDCL కంపెనీ అధ్యక్షుడు MD యూసుఫ్, TRANSCO కంపెనీ కార్యదర్శి P. రాములు, SPDCL సెంట్రల్ సర్కిల్ ప్రెసిడెంట్ విశాల్ రజనీకాంత్, అజాంపేట్ డివిజన్ అధ్యక్షుడు మరియు కార్యదర్శులు రాంప్రసాద్, రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశం విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఒక కీలక దశగా చేరుతుందని నాయకులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793