విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్
"విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు"
విశాఖ ఉక్కు కోసం చంద్రబాబు అహర్నిశ శ్రమ ఫలితం:
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయడంతో పాటు, ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ విజయానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మద్దతు, కృషి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
1999లో మొదలైన సంకల్పయాత్ర:
విజయవాడ ఉక్కు పరిశ్రమను నిలబెట్టడానికి 1999లో నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయి ని ఒప్పించి ఆర్థిక ప్యాకేజీ తీసుకువచ్చిన చంద్రబాబు, విశాఖ ఉక్కు భవిష్యత్తు కోసం అప్పట్లోనూ కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం దారికి తెచ్చిన ఉద్యమాలు:
గత ఐదేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొంటూ, ప్రజల భాగస్వామ్యంతో తెలుగుదేశం పార్టీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు నిరంతరం కృషి చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రధాని మోడీ ని వ్యక్తిగతంగా కలవడం, ఆంధ్రుల సెంటిమెంట్‌ను వివరించడం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచడం తదితర చర్యలు చురుకుగా కొనసాగించారు.
విశాఖ ఉక్కుకు ఊపిరి పోసిన కూటమి ప్రభావం:
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సూచించిన విధంగా కేంద్రం నడుచుకోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగి, ఆర్థిక ప్యాకేజీ ప్రకటించబడింది. ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక నెరవేరడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచే అవకాశం కలిగింది.
"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే నినాదాన్ని నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం మరోసారి సత్తా చాటింది. ఇది ఆంధ్రుల గర్వకారణం మాత్రమే కాకుండా, తెలుగుదేశం పార్టీకి కూడా గర్వకారణం.

Post a Comment