-->

సింగరేణి ఓపెన్ కాస్ట్ గని నుండి వెలువడే కాలుష్యం వలనే వ్యక్తి మృతి

 

సింగరేణి ఓపెన్ కాస్ట్ గని నుండి వెలువడే కాలుష్యం వలనే వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా,  సత్తుపల్లి మండలానికి చెందిన కిష్టారంలో బుర్ర తుకారాం అనే వ్యక్తి తీవ్ర శ్వాసకోశ వ్యాధితో మరణించాడు. తుకారాం మరణానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో తుకారాం, తన ఆరోగ్య సమస్యలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ గని వెలువడే కాలుష్యమే కారణమని వాపోయాడు.

తన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, కాలుష్య ప్రభావం వల్లే తన ఆరోగ్యం క్షీణించిందని ఆ వీడియోలో చెప్పాడు. స్థానికులు కూడా సింగరేణి ఓపెన్ కాస్ట్ గని వెలువడే కాలుష్యం పరిసరాల్లో ఎక్కువగా ఉందని, ఇలాంటి ఘటనలు మరింతగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కలుషిత వాతావరణంతో పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారనే వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారుల జోక్యం చేసుకుని కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793